శ్లోకం - 5
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః | నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ప్రకృతి యొక్క స్వరూపమైన సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణములు శాశ్వతమైన ఆత్మను శరీరము నందు భందించుచున్నవి.