శ్లోకం - 6

తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయమ్ | సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ త్రిగుణములలో సత్వ గుణము సద్గుణమును పెంపొందించి, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశింప చేస్తుంది. అలాగే ఆరోగ్యమును మరియు వ్యాధుల నుండి విముక్తినీ ఇస్తుంది. కానీ, ఈ సత్వ గుణము సుఖముల యందు ఆసక్తిని కలిగించి ఆత్మను సంసార చక్రము నందు బంధించుచున్నది.