శ్లోకం - 8

తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినామ్ | ప్రమాదాలస్యనిద్రాభిః తన్నిబధ్నాతి భారత ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అజ్ఞానం వలన జన్మించే తమో గుణము సర్వ ప్రాణులకు మోహమును కలుగచేయును. అది సమస్త జీవరాశులకు నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రను అలవాటు చేయడంతోపాటు ఏది మంచి లేదా ఏది చెడు అన్న విచక్షణను కోల్పోయేలా చేసి ఆత్మను సంసార చక్రము నందు బంధించుచున్నది.