శ్లోకం - 9
సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత | జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సత్వ గుణము జీవుడిని సుఖాలకు కట్టివేస్తుంది. రజో గుణము కర్మల యందు ఆసక్తిని కలిగిస్తుంది. తమో గుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదం కలగజేస్తుంది.