శ్లోకం - 10

రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత | రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, కొన్ని సార్లు రజో గుణమును మరియు తమో గుణమును నియంత్రించి సత్వ గుణము వృద్ధి చెందును. మరి కొన్ని సార్లు సత్వ గుణమును మరియు తమో గుణమును నియంత్రించి రజో గుణము వృద్ధి చెందును. ఇంకొన్ని సార్లు రజో గుణమును మరియు సత్వ గుణమును నియంత్రించి తమో గుణము వృద్ధి చెందును.