శ్లోకం - 11
సర్వద్వారేషు దేహే௨స్మిన్ ప్రకాశ ఉపజాయతే | జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ దేహములోని అన్ని ద్వారముల నుండి ప్రకాశించే జ్ఞానము ఎప్పుడు పుడుచున్నదో అప్పుడు సత్వ గుణము వృద్ధి చెందినదని తెలుసుకొనుము.