శ్లోకం - 15
రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే | తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రజో గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు కర్మల మీద ఆసక్తి ఉన్న మానవులకు జన్మించుచున్నారు. అదే విధముగా తమో గుణము వృద్ధి చెందిన సమయంలో మరణించిన వారు జంతువుల జీవరాశిలో జన్మించుచున్నారు.