శ్లోకం - 16
కర్మణః సుకృతస్యాహుః సాత్త్వికం నిర్మలం ఫలమ్ | రజసస్తు ఫలం దుఃఖమ్ అజ్ఞానం తమసః ఫలమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణ కర్మలకు సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును. రజో గుణ కర్మలకు ఫలము దుఃఖము. తమో గుణ కర్మలకు అజ్ఞానము ఫలము.