శ్లోకం - 18

ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థాః మధ్యే తిష్ఠంతి రాజసాః | జఘన్యగుణవృత్తిస్థాః అధో గచ్ఛంతి తామసాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణములో ప్రధానంగా ఉండేవారు స్వర్గాది ఉత్తమ లోకములకు పోవుచున్నారు. రజో గుణములో ప్రధానంగా ఉండేవారు మరల మానవ లోకమునే పొందుచున్నారు. తమో గుణములో ప్రధానంగా ఉండేవారు నరక లోకానికి పోవుచున్నారు.