శ్లోకం - 21

అర్జున ఉవాచ: కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో | కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ ప్రభు, ఈ మూడు గుణములను అధిగమించినవాడు ఏ లక్షణాలను కలిగి ఉంటాడు? అతడి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఈ గుణములను అతడు ఎలా అతిక్రమించుచున్నాడు?