శ్లోకం - 22

శ్రీ భగవానువాచ: ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ | న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పాండవా(అర్జునా), త్రిగుణములను అతిక్రమించినవాడు సత్వ గుణ లక్షణమైన ప్రకాశము వలన, రజో గుణ లక్షణమైన ప్రవృత్తి వలన, తమో గుణ లక్షణమైన మోహము వలన ఏవైతే ప్రాప్తించునో వాటిని ద్వేషించడు. అదే విధముగా అవి లేనప్పుడు వాటిని కోరుకోడు...