శ్లోకం - 25
మానావమానయోస్తుల్యః తుల్యో మిత్రారిపక్షయోః | సర్వారంభపరిత్యాగీ గుణాతీతః స ఉచ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను:గౌరవమును మరియు అవమానమును సమానముగా చూసేవాడు, శత్రువులయందును మరియు మిత్రువులయందును సమ భావముతో ప్రవర్తించేవాడు, కామ్యకర్మలన్నిటినీ విడిచిపెట్టినవాడు త్రిగుణాతీతుడని చెప్పబడుచున్నాడు.