శ్లోకం - 27
బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్ అమృతస్యావ్యయస్య చ | శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మరణము లేని, నశింప చేయలేని జీవాత్మ స్వరూపమును పొందుటకు, శాశ్వతమైన సనాతన ధర్మమునకు, అఖండ ఆనందమునకు నేనే ఆధారమును.