శ్లోకం - 1
శ్రీ భగవానువాచ: ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ | ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సంసారమనే అశ్వత్థ వృక్షముకు(రావి చెట్టు) నాశనం లేదని, వేదములే ఆకులుగా గలదని వేదము చెప్పుచున్నది. ఈ చెట్టు యొక్క రహస్యం తెలుసుకున్నవాడు వేదములను తెలుసుకున్నవాడగుచున్నాడు.