శ్లోకం - 4
తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్‌గతా న నివర్తంతి భూయః | తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి, అదియే ఆ భగవంతుడు. ఆయన నుండే ఈ విశ్వం సృష్టించబడినది. ఆనాదిగా ఈ సంసార వృక్షము విస్తరించడానికి కారకుడైన పరమాత్మను శరణుపొందాలి.