శ్లోకం - 9
శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ | అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జీవాత్మ చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు అను ఐదు జ్ఞానేంద్రియములనూ, మనస్సునూ ఆశ్రయించి ఇంద్రియ విషయములను అనుభవించును.