శ్లోకం - 10

ఉత్క్రామంతం స్థితం వాపి భుఞ్జానం వా గుణాన్వితమ్ | విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: గుణములతో కూడిన దేహములోనే స్థితమై ఉండి ఇంద్రియ విషయములను అనుభవిస్తున్నపుడూ లేదా దేహము నుండి విడిచి వెళ్లినప్పుడు గాని జీవాత్మను అజ్ఞానులు చూడలేరు. జ్ఞానదృష్టి కలిగిన వారు మాత్రమే చూడగలుగుతారు.