శ్లోకం - 11

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ | యతంతో௨ప్యకృతాత్మనః నైనం పశ్యంత్యచేతసః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అంతః కరణ శుద్ధి గల యోగులు దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను చూడగలరు. కానీ, అంతః కరణ శుద్ధి లేని అవివేకులు ఎంతగా ప్రయత్నించిననూ ఆత్మాను చూడలేరు.