శ్లోకం - 12

యదాదిత్యగతం తేజః జగద్భాసయతే௨ఖిలమ్ | యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్యుడి యొక్క తేజస్సును, చంద్రుడు మరియు అగ్నిలో ఉండే తేజస్సును కూడా నేనే అని తెలుసుకొనుము.