శ్లోకం - 13
గామావిశ్య చ భుతాని ధారయామ్యహమోజసా | పుష్ణామి చౌషదీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను భూమిలో ప్రవేశించి నా శక్తి ద్వారా సర్వ భూతాలనూ ధరించి, పోషించుచున్నాను. అమృతమయుడైన చంద్రుడనై సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూర్చుచున్నాను.