శ్లోకం - 16
ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ | క్షరః సర్వాణి భుతాని కూటస్థో௨క్షర ఉచ్యతే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ లోకము నందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు(ప్రాణులు) రెండు విధములుగా ఉన్నారు. నశించే సమస్త ప్రాణులను క్షరములు అని, మరణము లేని జీవులను అక్షరములు అని అంటారు.