శ్లోకం - 18
యస్మాత్ క్షరమతీతో௨హం అక్షరాదపి చోత్తమః | అతో௨స్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను క్షరుడిని మించిన వాడినీ, అక్షరుడి కంటే ఉత్తముడినీ కావడం వలన ఈ జగత్తు నందు మరియు వేదములలోనూ పురుషోత్తముడిగా కీర్తించబడుచున్నాను.