శ్లోకం - 20

ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ | ఏతద్‌బుద్ధ్వా బుద్ధిమాన్‌స్యాత్ కృతకృత్యశ్చ భారత ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, అత్యంత రహస్యమైన ఈ శాస్త్రమును నేను నీకు తెలియచేసాను. దీనిని తెలుసుకున్నవాడు నన్ను పొందుటకు కావలసిన సకల జ్ఞానమును పొందిన జ్ఞాని, కృతకృత్యుడు(సాధించవలసినది పూర్తి చేసినవాడు) అగుచున్నాడు.