శ్లోకం - 1

శ్రీ భగవానువాచ అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః | దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, భయం లేకపోవడం, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢ సంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, వేద శాస్త్రముల పఠనం, తపస్సు, సరళ స్వభావము... (సరళ స్వభావము అంటే మనసులో అనవసరమైన ఆలోచనలు తొలిగించి ఉత్తమమైన ఆలోచనలను జనింపచేస్తుంది.)