శ్లోకం - 2
అహింసా సత్యమక్రోధః త్యాగః శాన్తిరపైశునమ్ | దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహింస, సత్యమునే పలుకుట, క్రోధము లేకుండుట, త్యాగ గుణము, శాంతి, ఎవ్వరినీ నిందించ కుండా ఉండుట, సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, మృదువైన స్వభావము, సమాజానికి విరుద్ధంగా చేయటానికి వెనుకాడుట, చపలత్వము లేకుండుట...