శ్లోకం - 3
తేజః క్షమా ధృతిః శౌచమ్ అద్రోహో నాతిమానితా | భవన్తి సంపదం దైవీమ్ అభిజాతస్య భారత ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: తేజస్సు, క్షమా గుణము, ధైర్యము, బాహ్య శుద్ధి, ద్రోహ స్వభావము లేకుండుట, గర్వము లేకుండుట వంటి ఈ ఇరవై ఆరు లక్షణములు దేవతల సంపద వలన పుట్టిన వాడికి కలుగుతాయి.