శ్లోకం - 5

దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీ మతా | మా శుచః సంపదం దైవీమ్ అభిజాతో௨సి పాండవ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దైవ సంబంధమైన గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి. కానీ, రాక్షస సంబంధమైన గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. అర్జునా, నీవు దైవ సంబంధమైన గుణములతో జన్మించినవాడవు కనుక దుఃఖించకు.