శ్లోకం - 6
ద్వౌ భూతసర్గౌ లోకే௨స్మిన్ దైవ ఆసుర ఏవ చ | దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, ఈ లోకములోని మానవులు రెండు రకములుగా ఉండురు. దైవ లక్షణములు కలవారు మరియు అసుర(రాక్షస) లక్షణములు కలవారు. దైవ లక్షణముల గురించి వివరముగా తెలిపాను. ఇప్పుడు అసుర లక్షణములు కలవారి గురించి వివరముగా తెలిపెదను వినుము.