శ్లోకం - 8

అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్ | అపరస్పరసంభూతం కిమన్యత్కామహైతుకమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జగత్తులో సత్యము అనేది ఏదియును లేదని, ఆధారమైనది ఏదియును లేదని, భగవంతుడు అనేవాడు లేనేలేడని, స్త్రీ పురుషుల కలయిక వలన జీవులు పుట్టుచున్నారని, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదని రాక్షస లక్షణములు కలవారు వాదిస్తారు.