శ్లోకం - 11

చింతామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః | కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర గుణములు కలవారు మరణించు సమయం వరకు కూడా అంతులేని ఆందోళనలతో సతమతమై పోతుంటారు. ప్రాపంచిక సుఖములే ఉత్తమమైనవని భావించి అదియే నిజమైన సంతోషమని నమ్ముతారు.