శ్లోకం - 12
ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః | ఈహన్తే కామభోగార్థమ్ అన్యాయేనార్థసంచయాన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర లక్షణములు కలవారు ఇంద్రియ సుఖముల కొరకు ఎన్నో ఆశా పాశముల చేత బంధించబడి, కామ క్రోధములకు వశులై అన్యాయ మార్గములలో ధనము సంపాదించుటకు పాల్పడుచుందురు.