శ్లోకం - 15
ఆఢ్యో௨భిజనవానస్మి కో௨న్యో௨స్తి సదృశో మయా | యక్ష్యే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞానవిమోహితాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నేను ధనవంతుడిని, గొప్ప వంశంలో పుట్టినవాడిని, నాకు సమానుడు అయిన వాడెవడూ లేడు, నేను యజ్ఞములు చేస్తాను, దానములు ఇస్తాను, ఆనందిస్తాను. ఈ విధముగా అసుర గుణములు కలవారు అజ్ఞానంచే భ్రమపడుతుంటారు.