శ్లోకం - 16

అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః | ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే௨శుచౌ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అహంకారముచే సృష్టించబడిన మోహ భ్రాంతి వలలో చిక్కుకొని, భౌతిక సుఖముల పట్ల ఆసక్తులైన అసుర లక్షణములు కలవారు మరణించిన తరువాత ఘోర నరకమునకు వెళ్లుచున్నారు.