శ్లోకం - 17

ఆత్మసంభావితాః స్తబ్ధాః ధనమానమదాన్వితాః | యజన్తే నామయజ్ఞైస్తే దంభేనావిధిపూర్వకమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర లక్షణములు కలవారు తామే గొప్పవారమని భావించి, వినయ విధేయతలు లేకుండా, ధనము, సంపదచే గర్వము, అహంకారముతో శాస్త్ర నియమములు పాటించకుండా ఆడంబరముగా పేరుకు మాత్రమే యజ్ఞములు చేస్తారు.