శ్లోకం - 19
తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ | క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అసుర గుణములు కలిగి ద్వేషించువారిని, క్రూరులను, నీచులైన పాపాత్ములను మళ్ళీ మళ్ళీ పునర్జన్మ చక్రములో రాక్షస సంబంధమైన గర్భముల యందు పడవేస్తుంటాను.