శ్లోకం - 20

ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని | మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కుంతీ పుత్రుడా(అర్జునా), అసుర జన్మను పొందిన మూర్ఖులు నన్ను పొందలేక ఆయా జన్మలకంటెను రాబోవు జన్మలలో అంతకంతకీ అధోగతి పాలవుతారు.