శ్లోకం - 21
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః | కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కామము(కోరిక), క్రోధము(కోపము), లోభము(దురాశ) అను ఈ మూడు గుణములు ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు. కనుక ఈ మూడింటినీ విడిచి పెట్టాలి.