శ్లోకం - 24

తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ | జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కనుక ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. శాస్త్రములోని విధివిధానాలను గురించి తెలుసుకొని ఈ లోకము నందు అట్టి కర్మలను ఆచరించుము.