శ్లోకం - 1
అర్జున ఉవాచ: యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః | తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కృష్ణా, శాస్త్రవిధులను విడిచిపెట్టినప్పటికీ భక్తిశ్రద్ధలతో యజ్ఞములు గాని, దైవపూజలు గాని చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? సాత్వికమా? రాజసమా? తామసమా?