శ్లోకం - 2
శ్రీ భగవానువాచ: త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా | సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మానవులలో సహజసిద్ధమైన శ్రద్ధ మూడు రకములు. అవి సాత్త్వికము, రాజసము మరియు తామసము. ఇప్పుడు వాటి గురించి వివరించెదను వినుము.