శ్లోకం - 3

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత | శ్రద్ధామయో௨యం పురుషః యో యచ్ఛ్రద్ధః స ఏవ సః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ భారతా(అర్జునా), ప్రతి మానవుడికి వారి స్వభావమునకు తగ్గట్టుగా శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ లేకుండా ఏ వ్యక్తి కూడా ఉండరు. ఎవరికి ఎలాంటి శ్రద్ధ ఉంటుందో వారు అలాంటి వారు అవుతారు.