శ్లోకం - 4

యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః | ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సత్వ గుణము కలవారు దేవతలను, రజో గుణము కలవారు యక్షులను మరియు రాక్షసులను, తమో గుణము కలవారు భూత ప్రేతములను పూజించుచున్నారు.