శ్లోకం - 6

కర్శయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః | మాం చైవాన్తఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అట్టి అవివేకులు తమ శరీరములోని అవయవములనే కాక, ఆంతర్యామిగా ఉన్న నన్ను కూడా క్షోభ పెడుతున్నారు. అలాంటి అజ్ఞానులు అసుర గుణములు కలవారని తెలుసుకొనుము.