శ్లోకం - 7
ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః | యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణులకు ఇష్టమైన ఆహారములు మూడు విధములుగా ఉండును. అదే విధముగా మానవులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా మూడు విధములుగా ఉండును. వాటి యొక్క తేడాలను చెబుతాను వినుము.