శ్లోకం - 9

కట్వామ్లలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః | ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: రజో గుణము కలవారికి చేదుగా, పుల్లగా, ఉప్పగా, చాల వేడిగా, కారంగా, ఘాటుగా మరియు మాడిన ఆహార పదార్థములు ఇష్టము. ఈ ఆహారములు శరీరానికి బాధ, మానసిక ఆవేదన, రకరకాల అనారోగ్యాలు కలిగిస్తాయి.