శ్లోకం - 10
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ | ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: తమో గుణము కలవారికి చల్లబడినవి, రుచిలేనివి, చెడువాసనగలవి, పాసిపోయినవి, ఎంగిలివి, అపరిశుద్ధమైనవి మొదలగు ఆహార పదార్థములు ఇష్టము.