శ్లోకం - 11
అఫలాకాంక్షిభిర్యజ్ఞః విధిదృష్టో య ఇజ్యతే | యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ప్రతిఫలములను ఆశించకుండా, శాస్త్రములలో చెప్పబడిన నియమముల ప్రకారాముగా, తమ కర్తవ్యముగా విశ్వసించి చేసే యజ్ఞమును సాత్వికమైన యజ్ఞమంటారు.