శ్లోకం - 12
అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ | ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కానీ, ఓ అర్జునా, ఫలములను ఆశించి చేయు యజ్ఞము లేదా సరియైన నిష్ఠలేకుండ ఆడంబరము కొరకు చేయు యజ్ఞము రాజస యజ్ఞమని తెలుసుకొనుము.