శ్లోకం - 13

విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ | శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నిజమైన భక్తి మరియు విశ్వాసం లేకుండా, శాస్త్రోక్తమైన మార్గదర్శకాలకు విరుద్ధంగా, ప్రసాద వితరణ చేయకుండా, వేద మంత్రములను పఠించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞమును తామస యజ్ఞమని తెలుసుకొనుము.