శ్లోకం - 14

దేవద్విజగురుప్రాజ్ఞ పూజనం శౌచమార్జవమ్ | బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను సేవించుట, పవిత్రముగా ఉండుట, ఇంద్రియ నిగ్రహముతో కర్మలను ఆచరించుట, బ్రహ్మచర్యము మరియు అహింసను పాటించడం మొదలగునవి శారీరక తపస్సు అని చెప్పబడుచున్నవి.